‘వకీల్ సాబ్’ థియేటర్ల కౌంట్ ఎంతంటే..

Published on Apr 8, 2021 11:06 pm IST

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజవుతున్న పెద్ద సినిమా ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత చేసిన సినిమా ఇదే. అందుకే అభిమానుల్లో ఇంత క్రేజ్, ఈ స్థాయి హైప్. ఈ చిత్రం బాలీవుడ్ ‘పింక్’కు తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమాకున్న డిమాండ్ కారణంగా దాదాపు అన్ని థియేటర్లలోనూ ఈ సినిమానే పడుతోంది.

నైజాం ఏరియాల్లో 355 థియేటర్లు, సీడెడ్ ప్రాంతంలో 220 థియేటర్లు, ఆంధ్రాలో 600 థియేటర్లు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1175 థియేటర్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకో 300 స్క్రీన్లు, ఓవర్సీస్లో 700 థియేటర్లు కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2175 థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. లాక్ డౌన్ తర్వాత ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. సినిమా విడుదలవుతున్న స్థాయి చూస్తే మొదటిరోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :