‘వకీల్ సాబ్’ మూడు రోజుల్లో ఎంత రాబట్టాడంటే…

‘వకీల్ సాబ్’ మూడు రోజుల్లో ఎంత రాబట్టాడంటే…

Published on Apr 12, 2021 8:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. భారీఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అనుకున్నట్టే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే భారీ షేర్ రాబట్టింది. తొలిరోజు రూ.30 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన ఈ సినిమా రెండవ రోజు, మూడవ రోజు కూడ మంచి రన్ అందుకుంది. మధ్యలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారని అనుకున్నా చివరకు నార్మల్ ధరలకే విక్రయించాలని ఆదేశాలిచ్చింది న్యాయస్థానం.

సాధారణ ధరలే అయినప్పటికీ సినిమా మూడు రోజుల్లో రూ.53.5 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఏరియల్ వారీగా వసూళ్లను చూస్తే నైజాంలో 16.30 కోట్లు, సీడెడ్లో 8.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.70 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 4.62 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5.60 కోట్లు, గుంటూరులో 5.3 కోట్లు, కృష్ణాలో 3.3 కోట్లు, నెల్లూరులో 2.5 కోట్లు కలిపి మొత్తంగా 53.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ కలువుకుంటే ఆ మొత్తం రూ.59.8 కోట్ల వరకు ఉంది. ఇక రేపు, ఎల్లుండి సెలవులు కావడం సినిమాకు కలిసొచ్చే విషయమనే అనాలి. ఇంకొక 10 రోజులు చిత్రం గట్టిగా నిలబడగలిగితే బ్రేక్ ఈవెన్ మార్కును సులభంగా అందుకోగలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు