నేడు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఈ స్పెషల్ రోజుని తమ పార్ట్నర్స్ తో గడుపుతున్నారు. అయితే ప్రేమ కథల నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలకి ఆడియెన్స్ లో మంచి సుస్థిరమైన స్థానమే ఉంది.. అలా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో కూడా పలు బ్యూటిఫుల్ సినిమాలు ఓటిటిలో మంచి లవ్ స్టోరీ సినిమాల కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయని చెప్పవచ్చు. మరి ఇలా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఆ బెస్ట్ ప్రేమ కథా చిత్రాలు ఇవే..
ప్రేమలు:
గత ఏడాది మళయాళ సినిమా దగ్గర వచ్చిన ఈ సింపుల్ లవ్ స్టోరీ అక్కడ రికార్డులు బ్రేక్ చేసింది. అంతే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యిన ఈ చిత్రం ఆహాలో ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం:
ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రైమ్ టైం లో ఉన్న సిద్ధార్థ్, తమన్నా కలయికలో వచ్చిన ఈ సినిమా అప్పుడు సూపర్ హిట్ అయ్యింది. ఇద్దరి నడుమ బ్యూటిఫుల్ అండ్ ఫన్ లవ్ ట్రాక్ ఇప్పటికీ ఆడియెన్స్ లో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. షో డెఫినెట్ గా ఈ చిత్రాన్ని కూడా ప్రేమికులు నేడు చూడొచ్చు.
సామజవరగమనా:
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ క్రేజీ ట్విస్ట్ తో కూడిన లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ప్రేమించాయినా అమ్మాయి చెల్లెలి వరస అయితే ఎలా ఉంటుంది? అక్కడ నుంచి వారి ప్రేమ కథ ఎలా ఎండ్ అయ్యింది అనేది ఈ సినిమాలో మంచి హిలేరియస్ గా కనిపిస్తుంది. సో ఈ సినిమా కూడా ఆహాలో మస్ట్ వాచ్.
మా వింత గాథ వినుమా:
టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమా మాత్రమే కాకుండా మంచి ప్రేమ కథా చిత్రాలు కూడా చేసాడు. వాటిలో ఈ మా వింత గాథ వినుమా కూడా ఒకటి. తన కాలేజ్ మేట్ తో ప్రేమలో పడ్డ అబ్బాయి తన ప్రేమ విషయంలో ఎదుర్కొన్న ఊహించని మలుపులు ఏంటి సోషల్ మీడియాలోకి వెళ్లిన వారి ప్రేమ ఎలా సెటిల్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఆహాలో ఈ సినిమా చూడాల్సిందే.
కలర్ ఫోటో:
ఆ మధ్య అంతా లాక్ డౌన్ ఉన్న సమయంలో నేరుగా ఓటిటిలోకి వచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి ఓటిటిలో మన తెలుగు నుంచి ఈ చిన్న సినిమా ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ తో నటీనటులు దర్శకుడు ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించారు. మరి ఈ వాలెంటైన్స్ డే కి ఈ సినిమా కూడా ఒక ఉత్తమ ఛాయిస్.
నీలి మేఘ శ్యామ:
ఇది ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. 35 ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధా కృష్ణ నడుమ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ ప్రేమ కథా చిత్రంలో ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లు ప్రేమికులకు టచ్ అయ్యే విధంగా ఉంటాయి. మరి ఇప్పటివరకు తెలియని వారు ఈ సినిమాని ఆహాలో ట్రై చేయండి.