నటి వనిత విజయ్ కుమార్ పై ప్రస్తుతం ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రూమర్ సారాంశం ఏమిటంటే.. ఆమె నాలుగో పెళ్లికి సిద్ధమవుతుందట. వనిత విజయ్ కుమార్ నడుపుతున్న యూట్యూబ్ చానెల్ లో ఓ అభిమాని ఆమె పెళ్లి పై అడిగిన ప్రశ్నకు వనిత సమాధానమిస్తూ, ‘మీరు ఊహించని దాని కోసం ఎదురు చూడండి’ అంటూ జవాబు చెప్పింది. మళ్లీ పెళ్లి గురించి అడిగితే.. ఊహించని దాని కోసం ఎదురు చూడండి’ అంటుంది అంటే.. ఆమె మరోసారి పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ పోస్ట్ ల పై అటు వనిత విజయ్ కుమార్ కూడా ఇంకా స్పందించలేదు. తన నాలుగో పెళ్లి పై వార్తలను ఆమె ఖండించకపోవడంతో నిజంగానే ఆమె పెళ్లి పై మనసు పడిందని టాక్. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా వనిత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఎన్నో చూశాను. అయితే, ఒంటరిగా జీవించడం నాకు ఇష్టం లేదు. నాకు ఓ తోడు కావాలి. సంతోషంగా ఉండాలని ఆశ పడటంలో తప్పు లేదు కదా’ అంటూ ఆ మధ్య వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది.