నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు పంచుతూ బిజీగా ఉంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నిచోలై సచ్‌దేవ్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతోంది ఈ నటి. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.
తమిళనాడులో ఉన్న ప్రముఖులకు ఇప్పటికే పెళ్లి పత్రికలు పంచిన వరలక్ష్మి శరత్ కుమార్, ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా తన వివాహానికి ఆహ్వానించింది. ఇక ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి ఈ నటి వెళ్లింది. తన పెళ్లికి రావాల్సిందిగా బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధరకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక బాలకృష్ణతో కలిసి వరలక్ష్మి శరత్ కుమార్ ‘వీరసింహారెడ్డి’ మూవీలో నటించింది. ఈ సినిమాలో వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి పాత్రలో ఆమె నటించి మెప్పించింది.