మన టాలీవుడ్ లో సహా తమిళ్ సినిమాలో కూడా లేడీ విలన్ అనే పాత్రలకి ఇపుడు గుర్తొచ్చే పేరు ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పవచ్చు. అయితే తాను విలన్ రోల్స్ మాత్రమే కాకుండా సోలోగా కూడా చేసిన మొదటి సినిమానే “శబరి”. ఐటీ సినిమా తర్వాత తాను మరో థ్రిల్లర్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శత్వంలో ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
ఈ దర్శకుడు రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుండగా భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోబోతున్నారట. పూర్తి వివరాలు అతి త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రంతో అయినా వరలక్ష్మి శరత్ కుమార్ మంచి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.