ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బేబీ జాన్”

ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బేబీ జాన్”

Published on Feb 19, 2025 8:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్స్ గా దర్శకుడు కాలీస్ తెరకెక్కించిన భారీ చిత్రమే “బేబీ జాన్”. బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన భారీ సినిమాల్లో ఇది ఒకటి కానీ ఇది రీమేక్ కావడం మూలన పెద్దగా బజ్ దీనికి దొరకలేదు. ఈ సినిమా తోనే కీర్తి సురేష్ కూడా హిందీ సినిమా ఎంట్రీ ఇచ్చింది కానీ తనకి ప్లాప్ వెల్కమే దక్కింది.

అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది. ఇది వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ గా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దళపతి విజయ్ నటించిన పోలిసోడు కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు అలాగే ప్రియా అట్లీ హిందీలో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు