విడుదల తేదీ : డిసెంబర్ 25, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యావ్, జారా జ్యాన్నా
దర్శకుడు : కలీస్
నిర్మాతలు : మురద్ ఖెతాని, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే
సంగీత : థమన్
సినిమాటోగ్రఫీ : కిరణ్ కౌశిక్
కూర్పు: రూబెన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
కథ:
కేరళలోని అలప్పుజలో జాన్ డిసిల్వ(వరుణ్ ధావన్) తన కూతురు ఖుషి(జారా జ్యాన్నా)తో సంతోషంగా జివిస్తుంటాడు. ఖుషి టీచర్ తార(వామికా గబ్బి)కు దగ్గరవుతున్న జాన్ జీవితంలో.. ఊహించని ఘటన అతడు ఎవరనే విషయాన్ని బయటపెట్టేలా చేస్తుంది. ముంబైకు చెందిన డిసిపి సత్యవర్మ తాన చనిపోయినట్లుగా అందరినీ నమ్మించి ఇప్పుడు జాన్‌గా మారాడని తార కనిపెడుతుంది. అసలు సత్య వర్మ తాను చనిపోయినట్లు ఎందుకు చిత్రీకరించాడు..? అతడు దేనికి దూరంగా పరిగెడుతున్నాడు..? నానాజీ ఎవరు..? అతడితో జాన్ వైరం వెనక ఉన్న కథ ఏమిటి..? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
వరుణ్ ధావన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఓ తండ్రిగా మంచి నటనను కనబరిచాడు. అతడి లుక్స్, ఫిజిక్ తన పాత్రకు తగ్గట్టుగా సెట్ అయ్యాయి. చాలా సీన్స్‌లో అతడు సాలిడ్ పర్ఫార్మెన్స్ను అందించాడు.
వామికా గబ్బి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ‘తేరి’ మూవీలోని అమీ జాక్సన్ పాత్రలో వామికా కనిపించింది. అయితే, ఆమె తన పాత్రకు ఈ సినిమాలో చాలా డెప్త్ లభించింది. ఆమె లుక్స్ పరంగా ఇంప్రెస్ చేయడమే కాకుండా పర్ఫార్మెన్స్తో కూడా ఆకట్టుకుంటుంది.
కీర్తి సురేష్ ఎప్పటిలాగే తనదైన పర్ఫార్మెన్స్తో మెప్పించింది. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా కీర్తి పర్ఫార్మ్ చేసింది. జాకీ ష్రాఫ్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచాడని చెప్పాలి.
మైనస్ పాయింట్స్:
విజయ్ నటించిన ‘తేరి’ వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఎమోషనల్‌గా యాక్షన్ పరంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సాధించింది. అయితే, ఇలాంటి సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు కథను ఇంకాస్త డెవలప్ చేసి ఉండాల్సింది. సినిమాలోని పాత్రలను కూడా ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మక్కీ కి మక్కీ కథను రీమేక్ చేయడంతో పాటు సీన్స్, షాట్స్ కూడా ఏమాత్రం మార్చకుండా చేయడంతో ఈ సినిమాలో కొత్తదనం ఏముందనే ప్రశ్న అని ప్రేక్షకుల్లో ఏర్పడింది.
ఒరిజినల్ మూవీలోని ఎమోషన్, యాక్షన్ సమపాలలో ఉంటాయి. అయితే, ఈ సినిమాలోనూ అవి కినిపించినా, సరైన సమయంలో క్లిక్ కాలేదని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్లో అట్లీ ఎమోషన్‌ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాలో ఎమోషన్ చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది.
వరుణ్ ధావన్ తన పాత్రలో బాగానే కనిపించినా, ఎమోషనల్ సీన్స్‌లో మరికొంత లీనమై చేసుంటే అవి బాగా పండేవి. కీర్తి సురేష్‌తో అతడి లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదని చెప్పాలి.
జాకీ ష్రాఫ్ పాత్ర తొలుత స్ట్రాంగ్‌గా కనిపించినప్పటికీ, కథ సాగుతున్నకొద్ది అది డల్‌గా మారిపోతుంది. జాకీ ష్రాఫ్‌ను అవినీతి రాజకీయ నాయకుడి కంటే పవర్ఫుల్ డాన్‌గా ఎక్కువగా ప్రెజెంట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఒకట్రెండు సాంగ్స్ ఆకట్టుకున్నా అవి పెద్దగా ప్రభావం చూపలేదు.
ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్స్ అయిన రెండు మరణాల్లో ఉండే ఎమోషన్ని సరిగ్గా వినియోగించకపోవడం మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఒరిజినల్ సినిమాలో ఈ రెండు సీన్స్‌ను అట్లీ తెరకెక్కించిన తీరు.. జివి.ప్రకాష్ సంగీతంతో నెక్స్ట్ లెవెల్లో చూపెట్టారు. కానీ ఇందులో అవి రెండు మిస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం:
దర్శకుడు కలీస్ ‘బేబీ జాన్’ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. కానీ, సినిమాకు కీలకమైన ఎమోషనల్ డెప్త్ అనే పాయింట్‌ను సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. దీనిపై ఆయన మరింత ఫోకస్ పెట్టి ఉంటే, ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచేది. అయితే, ఈ సినిమాలో వామికా గబ్బి, రాజ్‌పాల్ యాదవ్, జాకీ ష్రాఫ్ పాత్రలను డిజైన్ చేసిన రైటింగ్ టీమ్‌ను అభినందించాలి.
థమన్ బీజీఎం సాలిడ్‌గా ఉంది. అయితే, అతడి గత చిత్రాలు చూసినట్లు అయితే, ఈ సినిమాకు వాడిన స్కోర్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్‌లో బాగున్నా, సెకండాఫ్‌లో ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.
తీర్పు:
మొత్తంగా యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా మూవీగా ‘బేబీ జాన్’ కొంతమేర ఆకట్టుకుంటుంది. వరుణ్ ధావన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో బాగానే నటించాడు. కీర్తి సురేష్ తన పాత్రలో మెప్పిస్తుంది. వామికా గబ్బి ఆకట్టుకోగా, జాకీ ష్రాఫ్ మెప్పించలేక పోతారు. ‘తేరి’ చిత్రానికి జిరాక్స్ కాపీ గా వచ్చిన ఈ సినిమాలో కలీస్, థమన్ తమ పనితనంతో ఇంప్రెస్ చేస్తారు. అయినా కూడా ఒరిజినల్ చిత్రాన్ని ‘బేబీ జాన్’ మ్యాచ్ చేయలేకపోతుంది. రొటీన్ మాస్ యాక్షన్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను ఇష్టపడేవారిని ఈ చిత్రం కొంతమేర ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team