‘హ్యాపీ డేస్’ ఫేం హీరో వరుణ్ సందేశ్ వరుసగా సినిమాలు చేస్తున్న ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కానిస్టేబుల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్యన్ సుభాన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పక్కా క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. హత్యలు చేస్తున్న కిరాతకుడిని వెంటాడే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు. మరి ఈ సీరియల్ కిల్లర్‌ని కానిస్టేబుల్ పట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూపెట్టబోతున్నారట.
ఇక ఈ సినిమాలో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తుంది. సుభాష్ ఆనంద్, గ్యానీ సంగీతం అందించిన ఈ సినిమాను బలగం జగదీశ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.