యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పటికపుడు కొత్త సబ్జెక్టులు జయాపజయాలతో సంబంధం లేకుండా టచ్ చేస్తూనే వస్తున్నాడు. అయితే ఇదే మెగా కుటుంబం నుంచి తనని లీగ్ ఉన్న హీరోగా కూడా మార్చింది అని చెప్పవచ్చు. అయితే తన నుంచి తన కెరీర్ 15వ సినిమాగా కొన్నాళ్ల కితమే దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఇండో కొరియన్ సినిమా కోసం అందరికీ తెలిసిందే.
అయితే ఈ చిత్రం షూటింగ్ పై మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో కట్ ని ఇపుడు రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య అలాగే వరుణ్ తేజ్ ఇంకా దర్శకుడు కలిపి ఒక కొరియన్ అమ్మాయితో రిలీజ్ చేసిన ఈ ప్రోమో సూపర్ ఫన్ గా ఉందని చెప్పాలి. తమ సినిమా కథ ఏంటి అనేది చెబుతూ మంచి ఫన్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ప్రోమో డెఫినెట్ గా ఈ సినిమాపై మంచి బజ్ ని రేకెత్తించింది అని చెప్పవచ్చు. ఇక ఈ వీడియోలో థమన్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి వరుణ్ తేజ్ తో యూవీ క్రియేషన్స్ వారు మంచి హిట్ కొట్టేలా ఉన్నారని చెప్పవచ్చు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి