వరద బాధితులకు వరుణ్ తేజ్ ఆర్థిక సాయం

వరద బాధితులకు వరుణ్ తేజ్ ఆర్థిక సాయం

Published on Sep 5, 2024 7:00 PM IST

తెలుగు రాష్ట్రాల ప్రజలు వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఏపీ, తెలంగాణలో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు ముందుకు వచ్చి తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వరద బాధితులకు అండగా నిలిచాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించడంతో పాటు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేర ఏపీ పంచాయితీ రాజ్ శాఖకు రూ.5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు.

ఇలా టాలీవుడ్‌కి చెందిన అందరూ వరద బాధితులకు సాయం అందిస్తుండటంతో అభిమానులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి కష్ట కాలంలో ఒకరికొకరు సాయం అందించాలని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా కోరాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు