తెలుగు రాష్ట్రాల ప్రజలు వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఏపీ, తెలంగాణలో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు ముందుకు వచ్చి తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వరద బాధితులకు అండగా నిలిచాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించడంతో పాటు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేర ఏపీ పంచాయితీ రాజ్ శాఖకు రూ.5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు.
ఇలా టాలీవుడ్‌కి చెందిన అందరూ వరద బాధితులకు సాయం అందిస్తుండటంతో అభిమానులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి కష్ట కాలంలో ఒకరికొకరు సాయం అందించాలని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా కోరాడు.
వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం…
నా వంతు బాధ్యతగా,
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు…
మరియు గౌరవ AP డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు ,
మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా…— Varun Tej Konidela (@IAmVarunTej) September 5, 2024