వరుణ్ పై అదిరే పోస్టర్ తో “మట్కా” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

వరుణ్ పై అదిరే పోస్టర్ తో “మట్కా” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Oct 1, 2024 11:58 AM IST

మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే నోరా ఫతేహి హీరోయిన్ గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా చిత్రం “మట్కా” కోసం తెలిసిందే. మరి భారీ వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరోసారి తన మార్క్ వెర్సటాలిటీ చూపిస్తూ వస్తున్నాడు.

ఇలా లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. వరుణ్ తేజ్ పై ఒక వింటేజ్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ తో ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ మరోసారి మెగాస్టార్ వింటేజ్ లుక్స్ ని తలపిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు