బ‌జ్: ‘మ‌ట్కా’కు భారీ బ‌డ్జెట్.. వ‌రుణ్ తేజ్ త‌గ్గించాడా..?

బ‌జ్: ‘మ‌ట్కా’కు భారీ బ‌డ్జెట్.. వ‌రుణ్ తేజ్ త‌గ్గించాడా..?

Published on Jun 27, 2024 10:00 AM IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్ప‌టికే శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన వైజాగ్ సెట్ లో జ‌రుగుతోంది. పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ లో క‌నిపిస్తాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

‘మ‌ట్కా’ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు మేక‌ర్స్. ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్ల మేర ఖ‌ర్చు కానున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హీరో వ‌రుణ్ తేజ్ త‌న రెమ్యున‌రేష‌న్ ను త‌గ్గించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఓకే చేసినప్పుడు రూ.12 కోట్లు డిమాండ్ చేసిన వ‌రుణ్‌, ఇప్పుడు రూ.6 కోట్లు మాత్రమే రెమ్యున‌రేష‌న్ గా తీసుకుంటున్నాడ‌ట‌.

త‌న సినిమా బ‌డ్జెట్ లో మార్పు జ‌రుగుతుండ‌టంతో, రెమ్యున‌రేష‌న్ త‌గ్గించి నిర్మాత‌ల‌కు మేలు చేయాల‌ని వ‌రుణ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా క‌రుణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వైరా ఎంట‌ర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు