బ‌జ్.. ఈసారి రొమాన్స్ అంటోన్న వ‌రుణ్ తేజ్

బ‌జ్.. ఈసారి రొమాన్స్ అంటోన్న వ‌రుణ్ తేజ్

Published on Jun 18, 2024 2:30 PM IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం క‌రుణ కుమార్ డైరెక్ష‌న్ లో ‘మ‌ట్కా’ మూవీలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో వ‌రుణ్ ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ల‌వ‌ర్ బాయ్ అవ‌తారంలో వ‌రుణ్ చివ‌ర‌గా ‘తొలిప్రేమ’ మూవీలో కనిపించాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ ఆయ‌న అలాంటి పాత్ర‌లో న‌టించ‌లేదు.

అయితే, ఇప్పుడు త‌న నెక్ట్స్ మూవీలో ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ చెప్పిన ఓ క‌థ‌కు వ‌రుణ్ తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట‌. ఈ క‌థ పూర్తి రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రానుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నుంద‌ట‌.

వ‌రుణ్ తేజ్ ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో మ‌రోసారి త‌న‌దైన ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు. ‘మ‌ట్కా’ మూవీ షూటింగ్ పూర్త‌వ‌గానే, ఈ సినిమాను ప‌ట్టాలెక్కించాల‌ని వ‌రుణ్ తేజ్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లోనే రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు