మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ ‘మట్కా’ బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ మూవీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఇది బాక్సాపీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కొంత బ్రేక్ తీసుకున్నాడు.
అయితే, ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీ కోసం వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతున్నాడట. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి, షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ మెజారిటీగా కొరియా, వియాత్నం నగరాల్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.