వరుణ్ తేజ్ వెర్సటాలిటీ.. ఎర్ర తుండుతో కొత్త లుక్ లీక్

వరుణ్ తేజ్ వెర్సటాలిటీ.. ఎర్ర తుండుతో కొత్త లుక్ లీక్

Published on Sep 14, 2024 11:07 AM IST

మెగా కుటుంబం నుంచి ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. అయితే వరుణ్ తేజ్ తన మొదటి సినిమా నుంచి కూడా ప్రతి సబ్జెక్టుని ఏదొక కొత్తదనంని చూపించాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా సినిమా పరంగానే కాకుండా తన నటన లుక్స్ విషయంలో కూడా వరుణ్ తేజ్ చాలా వెర్సటాలిటీ ప్రదర్శిస్తాడు.

ఇలా చాలా చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ ని తాను చేయగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం “మట్కా” కోసం కూడా వరుణ్ తేజ్ తన వెర్సటాలిటీ ప్రదరిస్తున్నాడు అని చెప్పాలి. ఆల్రెడీ సినిమాలో ఫస్ట్ లుక్ లోనే ఇంట్రెస్టింగ్ మిడిల్ ఏజ్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ఇక లేటెస్ట్ గా అయితే ఓ యంగ్ లుక్ లీక్ అయ్యి వైరల్ గా మారింది. మరి ఇందులో అయితే వరుణ్ తేజ్ అసలు ఫస్ట్ లుక్ కి దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాడని చెప్పాలి.

మొత్తం క్లీన్ షేవ్ లో యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా అందులో నుంచి వచ్చిన లుక్ అన్నట్టు ఇది తెలుస్తుంది. అలాగే ఇందులో వరుణ్ తేజ్ ఎర్ర తుండుతో కనిపించడం మరో హైలైట్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, మొన్న రామ్ చరణ్ పోస్టర్ కూడా సోషల్ మీడియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు