యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.
వాస్తవానికి ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇక నేడు తమ మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు మేకర్స్. ఈమూవీ మార్చి 1 న తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రెనైసెన్సే పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.