పుట్టినరోజునాడే స్ట్రైక్ చేయబోతున్న మెగా హీరో

పుట్టినరోజునాడే స్ట్రైక్ చేయబోతున్న మెగా హీరో

Published on Jan 16, 2021 10:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్లో తొలిసారి చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. అందుకే ఆయన బాగా కష్టపడుతున్నారు. బాక్సర్ పాత్ర కోసం విదేశాలకు వెళ్లి మరీ శిక్షణ తీసుకుని వచ్చారు. బాడీ బిల్డప్ చేసి కొత్త లుక్ తెచ్చుకున్నారు. గత ఏడాది ఆరంభంలోనే మొదలైన ఈ చిత్రం లాక్ డౌన్ మూలాన ఆగిపోయింది కానీ లేకుంటే ఈపాటికే రిలీజ్ అయ్యేది. ఇప్పుడేలాగూ సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి చిత్ర బృందం కూడ యాక్టివ్ అయింది.

ఈ జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు లాంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు