మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎంగేజింగ్‌గా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.
అయితే, ఈ సినిమా నుండి తాజాగా మూడో సింగిల్ సాంగ్‌గా ‘వస్తాను వస్తానులే’ అనే రొమాంటిక్ మెలోడి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఆకట్టుకుంది. ఈ పాటలో గోపీచంద్, కావ్య థాపర్ల మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.