టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చివరిసారిగా ఖుషీ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ హీరో నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో VD12 చేయనున్నారు.
ఈ VD12 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మ్యాజిక్ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే VD12 ఆగిపోయిందా అంటూ కొందరు అభిమానులు అడగగా, ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.
#VD12 shoot will resume once Family Star shoot is over
— Naga Vamsi (@vamsi84) January 29, 2024