అప్డేట్ కి రెడీ అయిన VD12?

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్న ఈ హీరో చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి VD12 లో కనిపించనున్నాడు. ఈ చిత్రంతో పాటుగా మరికొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే VD 12 ను సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శుక్రవారం ఉదయం 10:09 గంటలకు సితార ఎంటర్ టైన్మెంట్స్ నుండి అప్డేట్ ఉండనుంది అని వెల్లడించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది VD12 కి సంబందించిన అప్డేట్ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం VD12 చిత్రం శ్రీలంక లో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రం కోసం మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అయ్యాడు. ఇటీవల లీక్ అయిన ఫోటోలు అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. మరి ఆ అప్డేట్ ఏమై ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటల వేచి ఉండాల్సిందే.

Exit mobile version