యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 లో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. అయితే విజయ్ దేవరకొండ యొక్క మాస్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కండలు తిరిగిన దేహంతో మాస్ అవతార్ లో ఉన్న విజయ్ లుక్ కి సంబందించిన లీక్స్ పట్ల మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి లీక్స్ ను షేర్ చేయకండి, త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
We share your excitement and enthusiasm! We kindly request you to refrain from sharing any leaks.
The #VD12 OFFICIAL ANNOUNCEMENT will be coming very soon! ❤️????@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts… pic.twitter.com/IiXlWHllEG
— Sithara Entertainments (@SitharaEnts) July 23, 2024