“వేదం” ఛాయాగ్రాహకునికి అరుదైన గౌరవం..

ఒక సినిమాని మనం తెరపై చూస్తున్నాము అంటే ఒక దర్శకుని విజన్, నిర్మాత డబ్బులు ఉంటే సరిపోదు ఆ రెండిటిని కలిపి కెమెరాలో అందంగా బంధించే ఛాయాగ్రాహకుల వల్లే అవుతుంది అని చెప్పాలి. అలా చాలా సినిమాల్లో కొందరు సినిమాటోగ్రాఫర్ లకి వారి పేరు పక్కన ఐ ఎస్ సి(ISC) అనే జత పదాలని చూస్తాం అయితే దానికి అర్ధం చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు. ఇంతకీ ఈ ఐ ఎస్ సి అంటే ఆయా సినిమాటోగ్రాఫర్ లకి ఇచ్చే అరుదైన గౌరవం.

మన దేశంలో పలు శాఖలకు సంబంధించి పలు సంస్థలు ఉన్నాయి. అలా భారతీయ సినిమా దగ్గర తమ కెమెరా పనితనంతో అద్భుతమైన వర్క్ అందించిన కొందరికి దక్కే అరుదైన గౌరవమే ఇది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ షార్ట్ కట్ లో (ISC) వీరి సంస్థలో వేదం సినిమా సహా కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే ప్రయోగాత్మక చిత్రం అంతరిక్షం 9000 కేఎంపిహెచ్ ఇంకా మణికర్ణిక లాంటి ప్రైడ్ ఇండియన్ సినిమాలకి తన విజువల్స్ ని ఇచ్చిన ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ కి ఇపుడు దక్కింది.

సినిమాలో తన పనితనంతో అపారమైన వర్క్ అందించిన అందించినందుకు గాను ఐ ఎస్ సి వారు తమ సొసైటీలోకి ఆహ్వానించి ఈ గౌరవాన్ని అందించారు. మరి దీనితో జ్ఞాన శేఖర్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తన సినిమా జర్నీలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఈ కొత్త గుర్తింపు తనకి మరింత బాధ్యతని పెంచింది అని తాను తెలిపారు.

Exit mobile version