టాలీవుడ్లో తెరకెక్కుతున్న సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా, అది ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్ర టీజర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను క్రియేట్ చేసింది. వేదిక తన నటనతో ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా కథ ఏమిటనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాలో అర్వింద్ కృష్ణ, సాహితి దాసరి, జయప్రకాశ్, పవిత్రా లోకేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హరిత గోగినేని డైరెక్ట్ చేస్తుండగా ఏఆర్.అభి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.