‘మా నాన్న సూపర్ హీరో’ నుండి సెకండ్ సింగిల్ అప్డేట్

‘మా నాన్న సూపర్ హీరో’ నుండి సెకండ్ సింగిల్ అప్డేట్

Published on Sep 26, 2024 4:06 PM IST

నవ దళపతి సుధీర్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ అయ్యేలా చేశాయి.

ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘వేడుకలో’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.

ఈ పాటను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో షాయాజి షిండే, సాయి చంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు