వీడింతే బై బర్త్ గా రాబోతున్న విక్రమ్


విక్రమ్ మరియు దీక్షా సేథ్ నటించిన తమిళ చిత్రం ‘రాజపట్టాయి’. ఈ చిత్రానికి తెలుగులో ‘వీడింతే-బై బర్త్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. సుసీన్ద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకం పై ప్రతీష్ మరియు సంతోష్ నిర్మించారు. సుసీన్ద్రన్ గతంలో నా పేరు శివ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటల్లో విక్రమ్ సరసన
రీమ సేన్, శ్రీయ శరన్ మరియు సలోని నర్తించినట్లు సమాచారం.

ఈ చిత్రంతో దీక్షా సేథ్ తమిళనాట అడుగుపెట్టనుంది. నాన్న చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జిమ్ ట్రైనర్ గా కనిపించనున్నారు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళాతపస్వి కే.విశ్వనాధ్ గారు ఒక ముఖ్య పాత్ర పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం
అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి డిసెంబరు 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version