ఓటిటిలో రికార్డులు వేట మొదలు పెట్టిన “వీర సింహా రెడ్డి”.!


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ మరియు హనీ రోజ్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “వీర సింహా రెడ్డి”. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అయిన అఖండ ని మించి పెద్ద హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఈ సినిమా తాజాగా డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది.

తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో అందులో రిలీజైన ఈ సినిమా మొదటి నిమిషం నుంచే వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక్క నిమిషం లోనే లక్షా 50 వేలకు పైగా యూనిక్ వ్యూస్ ని సాధించి అయితే ఓటిటి హిస్టరీ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది. మొత్తానికి అయితే వీర సింహా రెడ్డి మేనియా కూడా నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version