ఓటిటి లో ‘వీరసింహా రెడ్డి’ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మంచి టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ కొట్టింది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో దునియా విజయ్ విలన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేసారు.

అయితే విషయం ఏమిటంటే, వీరసింహారెడ్డి మూవీ ఫిబ్రవరి 23 నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. కాగా ఈమూవీ ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ వర్షన్ లో అందుబాటులోకి రానున్నట్లు కొద్దిసేపటి క్రితం డిస్నీ హాట్ స్టార్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో అలరించిన వీరసింహారెడ్డి, ఓటిటిలో ఎంతమేర రెస్పాన్స్ అందుకుంటోందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Exit mobile version