విడుదల తేదీ : ఆగస్టు 14, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: బ్రహ్మానందం, వికె నరేష్, శ్రీ లక్ష్మి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, హర్ధ వర్ధన్, తదితరులు
దర్శకులు: అనురాగ్ పాలుట్ల
నిర్మాతలు : బాపినీడు, బి సుధీర్ ఈదర
సంగీత దర్శకుడు: RH విక్రమ్
సినిమాటోగ్రఫీ: అంకుర్ సి
ఎడిటర్ : నరేష్ అడుప, హరి శంకర్ TN
సంబంధిత లింక్స్: ట్రైలర్
వీరాంజనేయులు విహార యాత్ర, మొట్టమొదటి తెలుగు ఫ్యామిలీ రోడ్ ట్రిప్ చిత్రం. ఇది డైరెక్ట్ గా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. వికె నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని మరియు కామెడీ లెజెండ్ బ్రహ్మానందం నటించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం అంచనాలను అందుకుందా? లేదా అనేది సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ:
గోవాలో తాను నిర్మించిన హ్యాపీ హోమ్ లో విశ్రాంతి తీసుకోవాలని కలలు కనే వీరాంజనేయులు (బ్రహ్మానందం) చుట్టూ కథ తిరుగుతుంది. దురదృష్టవశాత్తూ, తన పదవీ విరమణకి ముందే మరణించాడు. అతని కొడుకు, స్కూల్ టీచర్ అయిన నాగేశ్వరరావు (VK నరేష్) ఇంటిని అమ్మాలని ప్లాన్ చేస్తాడు, అందుకు అతని కుటుంబం సమ్మతి అవసరం. గోవాకు కుటుంబ సమేతంగా రోడ్ ట్రిప్ కి వెళ్ళడానికి ఇది కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విభేదాలు మరియు వ్యక్తిగత సమస్యలు తెరపైకి వస్తాయి. అయితే నాగేశ్వరరావు ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అతను విజయం సాధిస్తాడా? మరి ఈ ప్రయాణం కుటుంబాన్ని ఎలా మారుస్తుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రం యొక్క కథనం మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. నిజమైన భావోద్వేగాలు మరియు ఆలోచనాత్మకమైన డైలాగ్‌లు ఇందులో ఉన్నాయి. వికె నరేష్ తన కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలని నిర్ణయించుకున్న తండ్రిగా, వివిధ భావోద్వేగాలను సమర్థవంతంగా చూపించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు.
వెటరన్ కమెడియన్ శ్రీ లక్ష్మి కూడా తన పాత్రలో అలరించింది. రాగ్ మయూర్ మరియు ప్రియా వడ్లమాని తోబుట్టువులుగా మెప్పించారు. ఈ చిత్రంలో మంచి కామెడీ ఉంది. సినిమాలోని విజువల్స్ ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:
కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేయలేదు అని చెప్పాలి. స్టార్టింగ్ బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో అనవసరమైన సన్నివేశాలతో కథను బాగా లాగినట్లు అనిపిస్తుంది.
కామెడీ మరియు ఎమోషన్స్ ను కలిపి మంచిగా చూపించడంలో దర్శకుడు తన మార్క్ మిస్సయ్యాడు. మరింత ఆకర్షణీయంగా ఉండే సన్నివేశాలను తీయడంలో విఫలం అయ్యాడు.
రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, మరియు శ్రీ లక్ష్మి వంటి పాత్రలను బాగా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకుల కోసం కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా చూపించాల్సి ఉంది.
క్లైమాక్స్ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తుంది, కానీ ఆ సమయానికి, స్లో పేసింగ్ మరియు అనవసరమైన రొమాంటిక్ సన్నివేశాలు దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి.
సాంకేతిక విభాగం:
కుటుంబ నాటకం కోసం దర్శకుడు అనురాగ్ విజన్ మెచ్చుకోదగినది. కానీ దానిని అమలు చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. అంకుర్ సి సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉంది, అయితే నరేష్ అడుపా మరియు హరి శంకర్ టిఎన్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. RH విక్రమ్ సంగీతం బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
తీర్పు:
మొత్తం మీద, వీరాంజనేయులు విహార యాత్ర మంచి కథా ఆలోచనను కలిగి ఉంది. కానీ అనుకున్న విధంగా దానిని చూపించడంలో దర్శకుడు సక్సెస్ సాధించలేక పోయాడు. కథ స్లాగా సాగడం, అనవసరమైన సన్నివేశాలు సినిమా ఫలితం పై ప్రభావాన్ని చూపాయి. VK నరేష్ మరియు ఇతర నటీనటుల నటన బాగానే ఉన్నప్పటికీ, సరైన ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో ప్రేక్షకుడు కథకి కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team