వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండూ పెద్ద బాక్సాఫీస్ రికార్థులు సృష్టిస్తాయి – లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండూ పెద్ద బాక్సాఫీస్ రికార్థులు సృష్టిస్తాయి – లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి

Published on Jan 4, 2023 10:01 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర చేస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఎంతో ఆకట్టుకుని మూవీ పై ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక మరోవైపు యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ పై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే అందరి నుండి మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. కాగా ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి కానుకగా ఒక్క రోజు గ్యాప్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న ఈ రెండు సినిమాల్లో సాంగ్స్ రాసిన ప్రముఖ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి నేడు మీడియాకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

వాల్తేరు వీరయ్య మూవీలో త్వరలో రిలీజ్ అవుతున్న నాలుగవ సాంగ్ గురించి చెప్పండి ?

ఈ పాట లిరిక్స్ సౌండింగ్ ఎంతో కొత్తగా అనిపించి సోదరుడు దేవిశ్రీప్రసాద్ కి వినిపించాను, తాను ఒక మంచి ట్యూన్ ని దానికి జోడించారు. పాట ఎంతో అద్భుతంగా రావడంతో పాటు తప్పకుండా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకం ఉంది.

 

ఈ రెండు సినిమాల్లో ఎక్కడైనా యాక్టర్ గా ఒక్క సీన్ లో అయినా కనిపించారా ?

అవును, వీరసింహారెడ్డి మా బావ మనోభావాలు సాంగ్ లో ఒకచోట కనిపిస్తాను.

 

దాదాపుగా సంక్రాంతి సినిమాలు అన్నిటికీ సాంగ్స్ రాసారు కదా, మరి మీదే సంక్రాంతి అనిపిస్తుందా ?

నిజానికి అనుకుంటే అది జరుగదు, ఒక్కోసారి అలా కుదురుతుంది అంతే.

 

మీరు కెరీర్ లో ఎన్నో పాటలు రాస్తూ ఉంటారు, కదా ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ?

అలా ఏమి ఉండదు, వచ్చిన సినిమాల అవకాశాల ప్రకారం టెక్నీక్, అనుభవాన్ని బట్టి పాటలు రాయడం జరుగుతుంది. అయితే పక్కాగా గొప్ప పాటలు, నెక్స్ట్ లెవెల్ లో ఉండే కంటెంట్ కావాలి అంటే మాత్రం తప్పకుండా కొంత సమయం పడుతుంది.

 

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లో అలా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న పాటలు ఏంటి ?

నిజానికి ఈ రెండు సినిమాల్లో దాదాపుగా పాటలు అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కలిగినవి అనే చెప్పాలి. దేనికదే ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇక ఇటువంటి పెద్ద సినిమాలకి కొంత సమయం ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా అలోచించి రాయవచ్చు. నా మట్టుకు నేను అయితే బాలకృష్ణ గారి అఖండ సినిమా రాయలేకపోయాను, అలానే గోపీచంద్ గారితో కలిసి క్రాక్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఎంతో కసి పట్టుదలతో ఈ పాటలకు వర్క్ చేశాను. ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ అదిరిపోగా నాలుగవ సాంగ్ అంతకు మించి ఉంటుందని నమ్మకం అయితే ఉంది.

 

సింగిల్ కార్డు రాస్తున్నప్పుడు మీపై ఒత్తిడి ఏమైనా ఉంటుందా ?

ఏ సినిమాకి అయినా సింగిల్ కార్డు కానీ లేదా ఒక పాట కానీ ఎలా రాయాలి అన్నా ముందు మనం పని చేసే దర్శకుడి విజన్ కి తగ్గట్లుగా రాయగలగాలి. ఆయన ఆలోచన మేరకు పాట ఇవ్వగలిగితే తప్పుకుండా అది అంచనాలు అందుకుంటుంది. అయితే ఒకవేళ సింగిల్ కార్డు రాయాల్సి వస్తే మాత్రం ఒక సౌలభ్యం ఉంటుంది. అదేమిటంటే, ఏ పాటలో ఎటువంటి పదాలు, భావాలు, వర్ణనలు వాడాము అనేది మనమే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అదే ఒక సినిమాకు పలువురు పాటలు రాసినట్లైతే ఆ పని దర్శకుడి మీద ఉంటుంది.

 

పెద్ద హీరోల మూవీస్ కి రాసేటపుడు వారి అభిమానుల అంచనాలు అందుకోవాలి అనే సవాల్ ఉంటుందా ?

తప్పకుండా అది ప్రతి హీరోకి ప్రతి సినిమాకి ఉంటుంది. ఒకవేళ మనం ప్రేమ పాట రాయవలసి వస్తే, గతంలో ఎటువంటి పాటలు రాశాము, దానికి ఒకింత విభిన్నంగా ఇందులో ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తాం. ఇక బాలయ్య గారిని తీసుకొండి, గతంలో ఆయనకు రాసిన మాదిరిగా కాకుండా కొత్తగా ఎలా రాయాలి అనే ఆలోచన చేస్తాము.

 

మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది?

ఇది నిజానికి నా ఆలోచన, ఒకానొక సందర్భంలో థమన్ కి ఇది చెపితే తప్పకుండా చేద్దాం దాచి ఉంచండి అన్నారు. అనంతరం ఆయన గోపీచంద్ గారికి చెప్పడంతో ఈ పాట వర్కౌట్ అయింది. మనోభావాలు అనేది మనం సాధారణంగా సమకాలికంగా వాడే పదం కదా.

 

మాస్ మొగుడు పాట గురించి చెప్పండి?

ఆ పాట మంచి ఊపుతో ఉంటుంది, మూవీలో క్లైమాక్స్ లో వస్తుంది ఆ సాంగ్.

 

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఎలా ఉండబోతున్నాయి?

తప్పకుండా ఇవి రెండు సినిమాలు కూడా ప్రేక్షకాభిమానులకి విజువల్ ట్రీట్ గా నిలవడంతో పాటు సాంగ్స్ అలరించడం, ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఇవి రెండూ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.

 

బాలయ్య, చిరంజీవి కి పాటలు రాసేటపుడు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు, వారి నుండి మీరు అందుకున్న అభినందనలు ?

బాలయ్య, చిరంజీవి వంటి వారి మీద పాట రాయడానికి ఊతమిస్తుంది. ఇద్దరూ కూడా ఎంతో మంచి మనసున్న హీరోలు. కొన్ని పదాలు అటువంటి గొప్ప ఇమేజ్ కలిగిన హీరోలకు మాత్రమే రాయగలం. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య కి రాసిన పాట విని చిరంజీవి గారు ఎంతో బాగుంది అన్నారు. అలానే మా బావ మనోభావాలు సాంగ్ షూటింగ్ సమయంలో బాలయ్య గారు బాగుందని మెచ్చుకున్నారు. అది విజువల్ గా కూడా సూపర్ గా ఉంటుంది.

 

ట్యూన్ కి లిరిక్ ఇస్తారా, లేక లిరిక్ కి ట్యూన్ కడతారా ?

నిజానికి మ్యూజిక్ డైరెక్టర్ కి లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు కాబట్టి ఆయన చెప్పే కథ యొక్క సందర్భం, ఆలోచన, విజన్ ని బట్టి పాట ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నా కెరీర్ లో ఎక్కువ సమయం ట్యూన్ కి లిరిసి రాయాల్సి వస్తుంది.

యువ లిరిక్ రైటర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి ?

ఇక్కడ ముఖ్యంగా పాట రాయడం పై ఆసక్తి, రాసే లక్షణం ఉందొ లేదో చూసుకోవాలి. అలానే కొందరు అయితే ఎంతో అద్భుతంగా మంచి కవిత్వాన్ని పాట రూపంలో అద్భుతంగా రాస్తారు. ఇక్కడ ఎక్కువగా ట్యూన్ కి లిరిక్ రాసె విధంగా ఆలోచన చేయాలి, ఒక్కో సమయంలో సొంతగా పాట రాసే సామర్ధ్యం కూడా కలిగి ఉండాలి. అయితే ఎంత గొప్పగా రాసిన సింపుల్ గా ఉండాలి అనేది ఇక్కడ ప్రధానం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడకి వచ్చాక అన్నిటికంటే ముఖ్యం ఓర్పు, సహనం, పట్టుదల, వాటిని వదిలిపెట్టకుండా పాటిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.

ఆల్ ది బెస్ట్, థాంక్యూ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు