బ‌జ్.. వెంక‌టేష్ సినిమాలో మ‌రో స్టార్ హీరో..?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. స‌క్సెస్ ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో వెంకటేష్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. గ‌తంలో అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో వెంక‌టేష్ ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాల్లో న‌టించారు.

ఇక ఈ సినిమాను జూలై 3న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో వెంక‌టేష్ తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా న‌టించ‌నున్నార‌ట‌. ఈ స్టార్ హీరో పాత్ర నిడివి 30 నిమిషాల పాటు ఉండ‌నుంద‌ట‌. ఈ పాత్ర కోసం నంద‌మూరి బాల‌కృష్ణ‌ను తీసుకొచ్చేందుకు అనిల్ రావిపూడి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌.

అయితే, దీనికి సంబంధించి అఫీషియ‌ల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వెంక‌టేష్ ఎక్స్-కాప్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టించ‌నుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించ‌నున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయ‌నున్నారు.

Exit mobile version