వారసుడి సినీ ఎంట్రీపై వెంకటేష్ కామెంట్స్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 4’ టాక్ షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర యూనిట్ సందడి చేసింది.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. సాధారణంగా తన ఫ్యామిలీ విషయాలు బయటపెట్టని వెంకటేష్ ఈసారి అందుకు భిన్నంగా తన పర్సనల్ విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. ‘వెంకీ వారసుడి అర్జున్ సినీ ఎంట్రీ ఎప్పుడు?’ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు వెంకీ పాజిటివ్ రిప్లై ఇచ్చాడు.

తన కుమారుడు అర్జున్ ప్రస్తుతం యూఎస్‌లో చదువుకుంటున్నాడని.. అతనికి ఫిల్మ్స్ అంటే ప్యాషన్ ఉందని.. సరైన సమయానికి తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని వెంకటేష్ తన వారసుడు ఎంట్రీ గురించి కామెంట్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు కూడా పాల్గొన్నారు. తన వారసుడు సినీ ఎంట్రీ గురించి వెంకటేష్ ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశాడో తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version