ఇంటర్వ్యూ: డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి – విక్టరీ వెంకటేష్!

Published on May 24, 2022 9:03 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా, తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, అలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను హీరో వెంకటేష్ తాజాగా వెల్లడించారు.

స్టార్ డం పక్కన పెట్టి, ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలాగే చేస్తా. ఐ లవ్ కామెడీ. పాత్రలో కి వెళ్ళాక, స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా చేస్తా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి లు సినిమాలు బాగా ఎంజాయ్ చేశా. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషం గా ఉన్నాను.

కామెడీ సినిమాలు చేస్తున్నప్పుడు చాలా క్రేజీ గా ఉంటాను. ఎంటర్ టైన్మెంట్ సినిమాలను థియేటర్ల లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో చూస్తేనే బాగుంటుంది. సినిమాలో డబుల్ డోస్ తో చేశా. ప్లాన్డ్ గా ఉండకుండా, లేజీ గా ఉంటేనే బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లో అలానే ఉంది.

డబ్బుకోసం గ్రీడి గా ఉండటం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రస్తుతం హ్యుమన్ బిహేవియర్ లో అందరికీ ఉంటది. మనం లెసన్ నేర్చుకోవాలి. చేంజ్ అవ్వాలి. డైరెక్టర్ అనిల్ ప్రతి ఒక్కరి నుండి బెస్ట్ రావడానికి ట్రై చేస్తారు. సింపుల్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్. చాలా క్రేజీ గా ఉంటారు.

చాలామంది ఈవివి సత్యనారాయన తో కంపేర్ చేస్తారు. టైమింగ్, కామెడీ చాలా బాగుంటుంది. బెటర్ ఔట్ పుట్ కోసం క్లియర్ గా ఉంటారు. నేనొక గుడ్ స్టూడెంట్ ను. ఈ చిత్రం లో రియల్ లైఫ్ కి చాలా ఆపోజిట్ గా ఉంటాను.

ఒకసారి వాయిస్ లో ఫన్ ఉంటుంది. ఇందులో అందరూ కూడా చాలా బాగా చేశారు. రే చీకటి ఉండే పర్సన్ గా చేయడం ఫస్ట్ టైమ్. ఎఫ్ 2 కి ఎఫ్ 3 కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలామందికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఆడియెన్స్ చూస్తారు, వాళ్ళు చెప్తారు.

డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రపంచం నీకు అవసరమైనది ఇస్తుంది. అందుకు నువ్వు వర్క్ చేయాలి. వచ్చిన దాంతో కరెక్ట్ గా ఉండాలి.

స్టార్టింగ్ నుండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఎఫ్ 2 లో వెంకీ ఆసన క్లిక్ అయ్యింది. హ్యూమర్ కోసం యాడ్ చేయడం జరిగింది. ఏదైనా ఆడియన్స్ కి ఇస్తాము, వాళ్ళను మనం రెస్పెక్ట్ చేస్తే, మనకి రెస్పెక్ట్ ఇస్తారు. సినిమా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.

సబ్జెక్ట్ బాగుంటే ఏ హీరోయిన్ తో అయినా మళ్ళీ మళ్ళీ చేస్తాను. నంబర్ కాదు కానీ, ఫ్యాన్స్ కి సినిమా నచ్చాలి, ప్రొడ్యూసర్స్ హ్యాపీ గా ఉండాలి. బాగా కలెక్ట్ చేస్తే చాలా హ్యాపీ. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఎవరైనా సక్సెస్ ఫుల్ సినిమా నే చేయాలి అని అనుకుంటారు.

బడ్జెట్, ఫిల్మ్ మేకింగ్ లో ఏమైనా ఆలోచిస్తారా మీరు? బేసికల్లీ ప్రొడ్యూసర్ లాగానే ఆలోచిస్తా. ఇలా చేస్తేనే ఆడుతుంది అని కాదు.

పాన్ ఇండియా సినిమా అనేది బిజినెస్. కన్ఫ్యూషన్ లేదు నాకు, నేను అంతగా ఆలోచించలేదు. కంటెంట్ ఉంటే చేస్తాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలా థింక్ చేయాలి. అది టీమ్ వర్క్. నేను డిసైడ్ చేయలేను.

కోవిడ్ టైమ్ లో ఎఫ్ 3, నారప్ప ల షూటింగ్ చాలా కష్టం గా జరిగింది. ప్రికాషన్స్ అన్ని తీసుకున్నా, ఇప్పటికీ తీసుకుంటున్నా. చాలామంది కేర్ లెస్ గా ఉన్నారు.

ప్రేమించుకుందాం రా చిత్రం రీ యూనిటీ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ నైస్ మెమరీ.

ఎఫ్2 సినిమా లో చాలా ఫన్ ఉంది కాబట్టే, ఎఫ్ 3 లో అదే ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందరూ చాలా బాగా చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెట్స్ లో ప్రతి ఒక్కరి తో టైమ్ ఎంజాయ్ చేశా.

రియల్ లైఫ్ లో అంతగా ఫ్రస్ట్రేట్ అవ్వను. కానీ టైమ్ విషయం లో చాలా పర్టికులర్ గా ఉంటా. సల్మాన్ ఖాన్ తో ఫైనల్ గా సినిమా చేస్తున్నాను. మైత్రి మూవీ మేకర్స్ మరియు సితార ఎంటర్ టైన్మెంట్స్ తో సినిమాలు చేస్తున్నా.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :