స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ కాగా, అవి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మూడో సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ కోసం హీరో వెంకటేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. ఈ మేరకు ఈ పాట అనౌన్స్‌మెంట్ కోసం ఓ ఫన్నీ వీడియోను షూట్ చేశారు. ‘నేను పాడతా’ అంటూ వెంకీ దర్శకుడు అనిల్ రావిపూడి వెంటపడటం ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.
ఇక ఈ పాటను భీమ్స్ రాకింగ్ మ్యూజిక్‌తో కంపోజ్ చేశాడట. ఈ పాటను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి