లేటెస్ట్ : కేజీయఫ్ కాంట్రవర్సీ పై స్పందించిన వెంకటేష్ మహా..కానీ.!

లేటెస్ట్ గా సౌత్ ఇండియా సినీ వర్గాల్లో ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేష్ మహా పాన్ ఇండియా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన కేజీయఫ్ 2 సినిమా పై పలు సంచలన కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే ఈ కాంట్రవర్సీ పై ఈ దర్శకుడు లేటెస్ట్ గా ఓ క్లారిటీ ఇచ్చాడు. ఓ వీడియో రూపం లో అయితే తాను మాట్లాడుతూ తాను ఒకానొక సందర్భంలో ఆ ఇంటర్వ్యూలో అన్న మాట మాట్లాడిన విధానం సరిగ్గా లేదని ఒప్పుకుంటానని కానీ..

ఆ సినిమాకి చేసిన స్టేట్మెంట్ అయితే వెనక్కి తీసుకోవడం లేదని తాను అన్నాడు. ఒక బాధ్యత గల దర్శకునిగా ఉండి ఆ తీరులో మాట్లాడి ఉండాల్సింది కాదు అని అందుకు క్షమాపణలు కోరుకుంటున్నానని కానీ ఆ సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనని చెప్పాడు. అంతే కాకుండా అదే వీడియో లో మరో కన్నడ సినిమాని మెచ్చుకున్నానని నేను అన్నది అన్ని సినిమాలకి సమాన ఆదరణ ఎందుకు లేదు అన్నది మెయిన్ పాయింట్ అన్నట్టుగా వివరణ ఇచ్చాడు. దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Exit mobile version