వెంకటేష్ మహా చేతుల మీదుగా ‘పైలం పిలగా’ ట్రైలర్ లాంచ్

వెంకటేష్ మహా చేతుల మీదుగా ‘పైలం పిలగా’ ట్రైలర్ లాంచ్

Published on Sep 16, 2024 9:21 AM IST

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘పైలం పిలగా’. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఇక ఈ మూవీ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేసారు.

సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన ‘ఊరెళ్ళిపోతా మావ’, ‘కంచె లేని దేశం’ పాటలకు పెద్ద అభిమానిని.. ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. మంచి డైలాగ్స్‌తో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. సినిమా టీం అందరినీ అభినందిస్తూ, అందరూ థియేటర్‌కు వచ్చి ఈ విలేజ్ డ్రామాను ఎక్స్‌పీరియన్స్ చేయాలి’ అని అన్నారు.

ఆనంద్ గుర్రం దర్శకత్వంలో వస్తోన్న మొదటి చిత్రంగా ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహ-నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు