‘రానా నాయుడు’ సిరీస్ ద్వారా నా ఈ సరికొత్త ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నా – విక్టరీ వెంకటేష్

‘రానా నాయుడు’ సిరీస్ ద్వారా నా ఈ సరికొత్త ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నా – విక్టరీ వెంకటేష్

Published on Mar 8, 2023 12:28 AM IST


తొలిసారిగా విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈవెబ్ సిరీస్ యోక్క ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ సిరీస్ రే డొనోవన్ కి రీమేక్ గా రూపొందిన రానా నాయుడు ని కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ తెరకెక్కించారు. మార్చి 10న గ్రాండ్ లెవెల్లో ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా రానా నాయుడు పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ సందర్భంగా టీమ్ తెలుగు మీడియాతో నేడు ప్రత్యేకంగా ముచ్చటించారు. అందులో భాగంగా నటుడు విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, తొలిసారిగా ఈ సిరీస్ ద్వారా రానాతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని, అలానే దీని ద్వారా సరికొత్తగా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆడియన్స్, ఫ్యాన్స్ ఆదరిస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. ఇక ఈ సిరీస్ లోని తన నాగ నాయుడు పాత్రలో పలు వేరియేషన్స్ ఉంటాయని, ఆ విధంగా దర్శకులిద్దరూ కూడా ఈ సిరీస్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు వెంకటేష్. అయితే ఈ సిరీస్ ని కుటుంబ సమేతంగా కాకుండా వ్యక్తిగతంగా ఎవరికి వారు వీక్షిస్తే బాగుంటుందని, ఇందులోని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని అలరిస్తాయని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు