ఐకానిక్ రోల్స్‌తో వెంకీ న్యూ ఇయర్ ట్రీట్ ఫిక్స్

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఓ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో వెంకీ చేసే పాత్ర ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుందని.. అలాగే ఈ సినిమాలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. కాగా వెంకీ కెరీర్‌లో ఐకానిక్ చిత్రాల్లోని కొన్ని గెటప్స్‌తో ఓ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘చంటి’ నుంచి చంటి.. ‘బొబ్బిలి రాజా’ నుంచి రాజా.. ‘జయం మనదేరా’ నుంచి మహాదేవ నాయుడు.. ‘ఘర్షణ’ నుంచి డిసిపి రామచంద్ర పాత్రలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

న్యూ ఇయర్ రోజును మరింత స్పెషల్ చేసేందుకు ఈ ఐకానిక్ పాత్రలు రాబోతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version