అల్లుడు వచ్చే వరకు వెంకీ మామదే హవా..!

అల్లుడు వచ్చే వరకు వెంకీ మామదే హవా..!

Published on Jan 29, 2025 11:00 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకెళ్తున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు అవుతున్నా, బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి పోటీ లేకపోవడం విశేషం.

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మిగతా రెండు చిత్రాలు ‘డాకు మహారాజ్’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలను వెనక్కి నెట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’కే ప్రేక్షకులు ఓటేయడం ఖాయం.

అటు వచ్చే వారం నాగచైతన్య తండేల్ రిలీజ్ వరకు మరే ఇతర తెలుగు పెద్ద సినిమా లేదు. దీంతో అల్లుడు వచ్చే వరకు వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తన రన్ కంటిన్యూ చేయడం ఖాయం. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు