నాగ్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన వెంకీ

నాగ్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన వెంకీ

Published on Sep 27, 2019 7:06 PM IST

నిర్మాత సురేష్ బాబు తాజాగా బాలీవుడ్లో విజయాన్ని అందుకున్న ‘దే దే ప్యార్ దే’ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ను వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు ఆయన. వెంకీ కూడా మొదట్లో ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నారట. కానీ ఇప్పుడు మాత్రం చేయాలా వద్దా అనే సందేహంలో పడినట్టు తెలుస్తోంది.

ఈ సందేహానికి కారణం నాగర్జున చేసిన ‘మన్మథుడు 2’ ఫ్లాప్ కావడమే. ఈ సినిమాలో నాగ్ తన వయసులో సగం వయసున్న అమ్మాయిలను ప్రేమిస్తుంటారు. పైగా వల్గర్ కామెడీ. ఇలాంటి సినిమాలో ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉన్న నాగర్జునను ప్రేక్షకులు చూడలేకపోయారు.

‘దే దే ప్యార్ దే’ కథ కూడా దగ్గర దగ్గర ‘మన్మథుడు 2’ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆ కథలో కుటుంబ ప్రేక్షకులు తనను చూస్తారా అని సందేహిస్తున్నారట వెంకీ. మరి చూడాలి వెంకీ ఈ సినిమా చేస్తారో లేదో. ఇకపోతే ప్రస్తుతం ‘వెంకీ మామ’ అనే సినిమా చేస్తున్న వెంకీ ఆ తర్వాత తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కినతో సినిమాలు చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు