విక్టరీ వెంకటేష్ “సైంధవ్” లో 9 ఫైట్ సీక్వెన్స్‌లు!

విక్టరీ వెంకటేష్ “సైంధవ్” లో 9 ఫైట్ సీక్వెన్స్‌లు!

Published on Dec 27, 2023 7:06 AM IST

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా థియేటర్ల లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి హిట్ ఫ్రాంచైజీ తో క్రేజ్ సొంతం చేసుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ ఇందులో కథానాయిక గా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శైలేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సైంధవ్‌లో మొత్తం 9 ఫైట్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలిపారు.

అయితే, ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఎలివేషన్ లాగా ఉండవని, అవి కథను ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అన్ని ఫైట్ సీన్స్ కి ఎమోషనల్ టచ్ ఉంటుందని శైలేష్ తెలిపారు. సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, బేబీ సారా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు