వెంకటేష్ “సైంధవ్” రిలీజ్ డేట్ ఫిక్స్!

వెంకటేష్ “సైంధవ్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Mar 29, 2023 6:42 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. HIT సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, వెంకటేష్ యొక్క మొదటి పాన్ ఇండియన్ మూవీ. ఈ చిత్రం చంద్రప్రస్థ అనే కల్పిత ఓడరేవు ప్రాంతంలో సెట్ చేయబడిందని టైటిల్ గ్లింప్స్ వీడియో వెల్లడించింది. ఈ చిత్రం డిసెంబర్ 22, 2023న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది అని మేకర్స్ తాజాగా ప్రకటించడం జరిగింది.

క్రిస్మస్ హాలిడే సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ మంచి రిలీజ్ డేట్‌తో ముందుకు వచ్చారు. విడుదల తేదీని ప్రకటించేందుకు వెంకటేష్ గన్ పట్టుకుని కంటైనర్‌పై కూర్చున్న మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సైంధవ్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ బిగ్గీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ సైంధవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు