‘వెంకీ అట్లూరి – సూర్య’ సినిమా అప్పటి నుంచే !

తమిళ హీరో సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా ? అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ చివరి దశలో ఉంది. దీంతో, వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ పైకి ఎక్కించేందుకు సూర్య సన్నద్ధం అవుతున్నాడు. ఈ ఏడాది జూన్ నెల నుంచి వెంకీ అట్లూరి సినిమాకు సూర్య డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

అన్నట్టు ఏ గెటప్ లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version