విడాకుల భర్తగా కనిపించబోతున్న నితిన్ ?

Published on Dec 5, 2022 11:08 pm IST

‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. తాజాగా హీరో నితిన్ తో వెంకీ కుడుముల మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నితిన్ విడాకులు తీసుకున్న భర్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఒంటరిగా బతికే ఓ మగాడి కథను వెంకీ కుడుముల ఫన్నీ వే లో చూపించబోతున్నాడట.

ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. నితిన్ కి కూడా పూర్తి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.

అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.. వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :