తనలా ఇంకొకరు మోసపోకూడదంటున్న వెంకీ

Published on Mar 5, 2021 2:02 am IST


యువ దర్శకుడు వెంకీ కుడుముల సైబర్ నేరగాళ్ల బారిన పడి కొంత డబ్బును పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అసలు ఒక దర్శకుడిని బురిడీ కొట్టించడం ఏమిటనేది అనేక మందిలో ఉన్న అనుమానం. వెంకీ డైరెక్ట్ చేసిన ‘భీష్మ’ చిత్రాన్ని జాతీయ అవార్డులకు దరఖాస్తు పెడతాననే పేరుతో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన మోసగాడు డబ్బును వసూలు చేశాడు. డబ్బు చెల్లించిన వెంకీ తీరా మోసం జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. అసలు ఘటన వెనుక ఉన్న పూర్తి సమాచారాన్ని చెప్పుకొచ్చారు వెంకీ. ఒక వ్యక్తి ఆయనకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమమై అతనే ‘భీష్మ’కు నేషనల్ అవార్డు దరఖాస్తులకు పంపమని సలహా ఇచ్చాడట.

సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మంచి అంశం ఉంది కాబట్టి దరఖాస్తు చేద్దామని అన్నాడట. నిజానికి అది మంచి ఆలోచనే కాబట్టి వెంకీ నమ్మి డబ్బుకు ఇచ్చారు. కానీ దాన్నే బలహీనతగా తీసుకుని మోసం చేశారు. మోసపోయాం కదా అని వెంకీ మౌనం వహించలేదు. తాను మోసపోయిన సంగతిని బాహాటంగా చెప్పి తనలా ఈ ఇండస్ట్రీలో ఇంకొకరు మోసపోకూడదని పోలీసులకు పిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏమరుపాటుతో ఉండటం కూడ హానికరం అంటూ జాగ్రత్త చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :