వెంకీ మామ’కు బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ

వెంకీ మామ’కు బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ

Published on Oct 17, 2019 9:59 PM IST

సంక్రాంతి సినిమాల విడుదల తేదీల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు వస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అసలు ఈ సినిమాలు ఒకేరోజు రావడానికి కారణం ‘వెంకీ మామ’ అనే అంటున్నారు. ఈ చిత్రం జనవరి 14కు ఫైనల్ కావడంతో ఆ రెండు పెద్ద సినిమాలు 12కు రావాలని పట్టిబట్టుకుని కూర్చుకున్నాయట.

ఇక నిర్మాత సురేష్ బాబు ఇంత పోటీలో రిలీజ్ చేయడం ఎందుకు డిసెంబర్లో వస్తే పోతుందిలే అనుకుంటే ఆ చిత్రానికి లైన్ క్లియర్ చేయడం కోసం డిసెంబర్ 20, 25న రావల్సిన ‘డిస్కో రాజా, భీష్మ’ చిత్రాలు వాయిదాపడుతాయనే టాక్ కూడా ఉంది. మొత్తానికి ‘వెంకీ మామ’ విడుదల తేదీల విషయంలో కొన్ని సినిమాల్ని తొందరపెట్టి, ఇంకొన్ని సినిమాల్ని డైలామాలో పడేసి హాట్ టాపిక్ అయింది.

ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడినా ఇంతకీ ‘వెంకీ మామ’ ఎప్పుడు అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతలా అలజడి సృష్టించింది వ్యవహారం. మొత్తానికి ఎలాంటి ఖర్చూ, కష్టం లేకుండానే సినిమాకు బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ లభించడమే కాకుండా అన్ని సినిమాల్ని డిస్టర్బ్ చేస్తోందంటే ‘వెంకీ మామ’లో విషయం గట్టిగానే ఉందేమో అనే హైప్ కూడా ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు