‘నారప్ప’ క్లైమాక్స్ కి వెంకీ ప్యాకప్ !

Published on Nov 29, 2020 1:10 am IST


విక్టరీ వెంకటేష్‌ ‘నారప్ప’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్లైమాక్స్ లో వందమంది వరకు జూనియర్ ఆర్టిస్ట్ లు అవసరం అవుతారని.. అయితే వారికి సంబంధించిన షాట్స్ ను మాత్రం ఇంకా తీయలేదని.. కేవలం హీరోకి సంబంధించిన షాట్స్ మొత్తం వెంకీ మీద ఈ రోజుతోటి తీయడం పూర్తి చేసారని తెలుస్తోంది.

ఇక సినిమాలోనే ఈ క్లైమాక్స్ సీన్స్ చాల కీలకమైనవి అట. ఈ కీలక సీన్స్ లో వెంకీ సహా ముఖ్యమైన నటీనటులంతా షూటింగ్లో పాల్గొన్నారట. ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ ల క్రూ మాత్రమే పాల్గొనలేదట. ఇక లాక్ డౌన్ కి ముందు రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని వెంకీ లుక్ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది.

కాగా ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More