హీరో రవితేజ పై ఆసక్తిక్ర వ్యాఖ్యలు చేసిన వేణు …!!

హీరో రవితేజ పై ఆసక్తిక్ర వ్యాఖ్యలు చేసిన వేణు …!!

Published on Jul 7, 2022 1:00 AM IST

వేణు తొట్టెంపూడి తొలిసారిగా టాలీవుడ్ కి విజయభాస్కర్ తీసిన స్వయంవరం మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ మంచి సక్సెస్ సాధించి ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అనేక సినిమా అవకాశాలు అందుకున్న వేణు, వాటితో బాగా క్రేజ్ అందుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలకు ఒకింత దూరంగా ఉంటూ వస్తున్న వేణు, ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించారట. ఇక లేటెస్ట్ గా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీలో సిఐ మురళి పాత్ర చేస్తున్నారు.

ఇక ఈ మూవీ గురించి నేడు మీడియాతో వేణు మాట్లాడుతూ, నిజానికి సినిమాలు ఆపేయాలనుకున్న తనకి దర్శకుడు శరత్ మండవ ప్రత్యేకంగా వచ్చి కలిసి స్టోరీ తోపాటు తన పాత్ర గురించి చెప్పడం, అది తనకు ఎంతో నచ్చడంతో ఫైనల్ గా చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు వేణు. ఇక హీరో రవితేజ యాక్టింగ్ లో పవర్ హౌస్ వంటి వ్యక్తి అని, అందరితో ఎంతో సరదాగా ఉండే రవితేజ సెట్స్ లోని వారందరిలో మంచి ఎనర్జీ నింపుతారని, తనతో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా ఇందులో మురళి పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు వేణు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు