బెంగుళూరు డేస్ – వరుణ్ తేజ్ ఇన్, బొమ్మరిల్లు భాస్కర్ అవుట్.!

బెంగుళూరు డేస్ – వరుణ్ తేజ్ ఇన్, బొమ్మరిల్లు భాస్కర్ అవుట్.!

Published on Feb 24, 2015 12:32 AM IST

Venu-Sriram
గత సంవత్సరం మోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ సాధించిన సినిమా ‘బెంగుళూరు డేస్’. మలయాళ స్టార్ హీరోస్ అయిన దల్క్వేర్ సల్మాన్, నివిన్ పాళీ, ఫహద్ మరియు నజరియా నటించిన ఈ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో రీమేక్ చెయ్యడానికి పివిపి – దిల్ రాజు కలిసి రీమేక్ రైట్స్ ని కొని చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సరైన టీం సెట్ అవ్వలేదు. మొదటి నుంచి పలువురు పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదు. తాజా సమాచారం ముందు నుంచి అనుకుంటున్న డైరెక్టర్ మారనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పటి నుంచి ఈ రీమేక్ కి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ అని అన్నారు. కానీ తాజాగా భాస్కర్ తప్పుకోగా ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరాం డైరెక్ట్ చెయ్యనున్నాడనే వార్తలు వస్తున్నాయి. అలాగే తాజాగా తెలుగు వెర్షన్ కోసం వరుణ్ తేజ్ ని పరిశీలిస్తున్నారు. తెలుగులో మరో హీరోగా శర్వానంద్ ని అనుకుంటున్నారు. తమిళ వెర్షన్ కి మాత్రం రానా, ఆర్య, బాబీ సింహా, శ్రీదివ్యలను ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఇలా ఎన్నో పేర్లు వినిపిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫైనల్ గా ఎవరెవరు నటిస్తారనేది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి 20న ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని హైదరాబాద్, చెన్నై, సింగపూర్ లలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు